![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgMO1x45bwHMD48zinPxxRtiDMiqHK0x9otbXrkPBHtaJYechBu6tSa6tEIoeARYMIrYehT9Vlol9K2lpK9XL1wg-e5p2gzQTzrkbLIfIJufa02uOx2TxddUN_37o00EpbZd0VmmR1uXLw/s400/81793560_2523605117927295_2151251163247280128_n.jpg)
జాతీయ బాడీ లిఫ్టింగ్ పోటీలలో ఐదుగురికి పతకాలు
(విశాఖపట్నం-న్యూస్ విజన్): 11వ జాతీయ బాడి లిఫ్టింగ్ పోటీలలో విశాఖ జిల్లా నుంచి ఐదుగురు పతకాలు సాధించారు...ఆగ్రా లో ఈ నెల 4, 5 తేదీలలో జరిగిన జాతీయ బాడి లిఫ్టింగ్ పోటీల లో సీనియర్స్ విభాగంలో విజయ మౌళి కాంస్యం (గాజువాక), జె. నవీన్, కాంస్యం (ఎస్ఏఎస్ఎస్ కాలేజీ), మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ విభాగంలో బి. ఆనంద్ రావు రజతం, డి ఎస్ ఎన్ రాజు కాంస్యం, కొన గోవింద్ కాంస్యం సాధించారు.. ఇండియన్
బాడి లిఫ్టింగ్ సంఘం 2019 సంవత్సరం గాను ఇచ్చే ఇండియన్ బాడి లిఫ్టింగ్ సంఘం ప్రెసిడెంట్ అవార్డ్ ను నగరానికి చెందిన కిలాని గణేష్ దక్కించుకున్నారు. గెలుపొందిన విజేతలను జిల్లా, రాష్ట్ర బాడి లిఫ్టింగ్ సంఘం ప్రతినిధులు, విశాఖ జిల్లా జిమ్ అధినేతలు, వ్యాయామ కోచ్ లు అభినందించారు. ఈ పోటీలకు సీహెచ్ మధు, కిలాని గణేష్ న్యానిర్ణేతలుగా వ్యవహరించారు.
No comments:
Post a Comment